ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Dec 05, 2020 , 01:38:07

వేసవి నాటికి ఇంటింటికీ గోదావరి జలాలు

వేసవి నాటికి ఇంటింటికీ గోదావరి జలాలు

  •  మిషన్‌ భగీరథ పనులు వేగంగా కొనసాగుతున్నాయి
  • మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రత్యేక కృషి
  • భూపాలపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌  వెంకటరాణిసిద్దు,  వైస్‌ చైర్మన్‌ హరిబాబు

భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీలోవచ్చే వేసవి నాటికి ఇంటింటికీ శుద్ధమైన గోదావరి జలాలు అందించనున్నట్లు భూపాలపల్లి మున్సిపల్‌  చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణిసిద్దు, వైస్‌చైర్మన్‌ కొత్త హరిబాబు తెలిపారు. మున్సిపాలిటిలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేయూతనిస్తున్నదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. శుక్రవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులోని ఎల్‌బీ నగర్‌లో రూ.15 లక్షల ప్రత్యేక నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, సైడ్‌కాల్వ నిర్మాణ పనులను చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌, వార్డు కౌన్సిలర్‌ నాగుల శిరీషదేవేందర్‌రెడ్డితో కలిసి  ప్రాంభించారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో మిషన్‌ భగీరథ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వచ్చే వేసవి నాటికి ఇంటింటికీ గోదావరి జలాలు అందిస్తామన్నారు. పనులను త్వరగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే రమణారెడ్డి తరచూ సమీక్షిస్తున్నారన్నారు.

పట్టణ ప్రగతికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. అభవృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతుంటే కొందరు రాజకీయ లబ్ధి కోసం కావాలని రాద్దంతం చేస్తున్నారని చైర్‌పర్సన్‌ అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జక్కం రవి, పిల్లలమర్రి శారదనారాయణ, నూనె రాజు, ముంజంపల్లి మురళి, ఎడ్ల మౌనిక శ్రీనివాస్‌, పానుగంటి హరిక శ్రీనివాస్‌, అకుదారి మమతరాయమల్లు కాలనీ వాసులు పాల్గొన్నారు.

VIDEOS

logo