గురువారం 28 జనవరి 2021
Jayashankar - Dec 04, 2020 , 03:21:14

రోడ్ల మరమ్మతుకు నిధులు మంజూరు

రోడ్ల మరమ్మతుకు నిధులు మంజూరు

  •  23 పనుల కోసం రూ.4కోట్ల 30లక్షలు
  • డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి మంజూరు చేసిన కలెక్టర్‌

జయశంకర్‌ భూపాలపల్లి,నమస్తేతెలంగాణ: 2020 ఆగస్టులో భారీ వానలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు భూపాలపల్లి కలెక్టర్‌  భారీగా నిధులను మంజూరు చేశారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 23 పనులకు డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.4కోట్ల 30లక్షలను కేటాయించారు. రోడ్ల మరమ్మతుకు సమాయత్తం మవుతున్నామని రోడ్లు భవనాల శాఖ డీఈఈ రమేశ్‌ తెలిపారు. రేగొండ మండలంలోని గరిమిల్లపల్లి 19 కిలోమీటర్‌ వద్ద ఉన్న లోలెవల్‌ కాజ్‌వే మరమ్మతుకు రూ. 50లక్షలు, 32 కిలోమీటర్‌ వద్ద ఉన్న లోలెవల్‌ కాజేవే మరమతుకు రూ.50లక్షలు, మొగుళ్లపల్లి మండలం నుంచి పరకాలరోడ్డు 8కిలోమీటర్‌ నుంచి 16 కిలోమీటర్‌ వరకు మరమ్మతుకు రూ.10లక్షలు, బుజ్‌నూర్‌ నుంచి గుమ్మడవెల్లి రోడ్డు మరమ్మతుకు రూ.5లక్షలు, రేగొండ - గరిమిల్లపల్లి రోడ్డుకు  రూ.50లక్షలు, రేగొండ మండలంలోని గరిమిల్లపల్లి లోలోలెవల్‌ కాజ్‌వే మరమ్మతుకు రూ.లక్ష, రేగొండ  మండలం నుంచి జాకారం రోడ్‌ మరమ్మతుకు రూ. 3లక్షలు, పంకెన నుంచి కనకనూర్‌  వరకు రోడ్డు మరమ్మతుకు 1కిలో మీటర్‌ నుంచి 10వ కిలోమీటర్‌ వరకు రూ. 50లక్షలు, పంకెన నుంచి కనకనూర్‌ లోలెవల్‌ కాజ్‌వే 5వ కిలోమీటర్‌ వద్ద మరమ్మతుకు రూ. 50లక్షలు, జంగాలపల్లి నుంచి గాంధీనగర్‌ వరకు20 కిలోమీటర్‌ నుంచి 23 కిలోమీటర్‌ వరకు రోడ్డు మరమ్మతుకు రూ.40 లక్షలు, మహదేవ్‌పూర్‌ మండలంలోని మైనర్‌ బిడ్జి టోవాల్‌ నిర్మాణానికి  ముకునూర్‌, కనకపూర్‌, కాటారం 72 కిలోమీటర్‌ వద్ద మరమ్మతుకు రూ. 5లక్షలు, మల్హర్‌రావు మండలంలోని తాడిచెర్లలోని 11కిలోమీటర్‌ వద్ద సీసీ రోడ్డు మరమ్మతుకు రూ.10లక్షలు, పీడబ్ల్యూ రోడ్డు తాడిచెర్ల లేయింగ్‌ వియర్‌ నిర్మాణానికి రూ.4లక్షలు, మహాముత్తారం మండలంలోని యామన్‌పల్లి 1కిలోమీటర్‌ నుంచి 8కిలోమీటర్‌ వరకు లోలెవల్‌ టోవాల్‌ నిర్మాణానికి రూ. 10లక్షలు, మహదేవ్‌పూర్‌ మండలంలోని ముకునూర్‌, కనకనూర్‌, కాటారం 52 కిలోమీటర్‌ మైనర్‌ బ్రిడ్జి రిపేర్‌కు రూ.2లక్షలు, ఆజంనగర్‌ నుంచి లింక్‌ రోడ్‌ మరమ్మతుకు రూ.50లక్షలు,  పస్రా- భూపాలపల్లి బీటీ రోడ్డు ప్యాచ్‌ వర్క్‌కు రూ. 5లక్షలు, మహదేవ్‌పూర్‌, ముకునూర్‌, కాటారం  హెచ్‌పీ కల్వర్టుల మరమ్మతుకు రూ.10లక్షలు, మహదేవ్‌పూర్‌, ముకునూర్‌, కనకనూర్‌, కాటారం రోడ్డు వెడల్పు, బాడివాల్‌ కోసం రూ.5లక్షలు, మల్హర్‌రావు మండలంలోని రుద్రారం నుంచి కొయ్యూరు వరకు బీటీ రోడ్డు ప్యాచ్‌ వర్క్‌ కోసం రూ. 10లక్షలు, కొత్తపల్లి నుంచి మహబూబ్‌పల్లి బీటీ రోడ్డు ప్యాచ్‌ వర్క్‌ల కోసం రూ.5లక్షలు, మహదేవ్‌పూర్‌, ముకునూర్‌, కనకనూర్‌, కాటారం 38 కిలోమీటర్‌ వద్ద  టోవాల్‌ నిర్మాణం కోసం రూ. 5లక్షలను  కేటాయించారు.


logo