శనివారం 23 జనవరి 2021
Jayashankar - Dec 04, 2020 , 03:21:10

నీతి ఆయోగ్‌ వెబ్‌సైట్‌లో అభివృద్ధి వివరాలు

నీతి ఆయోగ్‌ వెబ్‌సైట్‌లో  అభివృద్ధి వివరాలు

  • జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

భూపాలపల్లి కలెక్టరేట్‌, డిసెంబర్‌ 3: వివిధ శాఖల వారీగా అభివృద్ధి వివరాలను నీతి ఆయోగ్‌ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. గురువారం నీతి ఆయోగ్‌ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలో విద్య, వైద్యం, పౌష్ఠికాహారం, మౌలిక వసతుల కల్పన, ఆర్థిక తోడ్పాటు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో జరుగుతు న్న అభివృద్ధిపై కలెక్టర్‌, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నీతి ఆయోగ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని మండలాలు, గ్రామాల వారీగా ఆయా రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ఉమ్మడి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యలో డ్రా పౌట్స్‌ లేకుండా విద్యాశాఖ ద్వారా ప్రతి విద్యా ర్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు చెప్పారు.

ఉచిత ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అంగన్‌వాడీల ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు పాడి, ఉద్యానవన రంగాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. బ్యాంకుల సహకారంతో పేద ప్రజల ఆర్థిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నా మని వెల్లడించారు.

జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి

 అనంతరం కలెక్టర్‌ సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించి 2019 మార్చిలో నీతి ఆయోగ్‌ ప్రకటించిన అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ర్యాంకింగ్‌లో జిల్లా దేశ స్థాయిలో మొదటి ర్యాంకును పొందిందని, అధికారులు జిల్లా అభివృద్ధికి కృషి చేసి అభివృద్ధి వివరాలను ప్రతి నెలా నీతి ఆయోగ్‌కు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హన్మంతు కొండిబా, నీతి ఆయోగ్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ రాహుల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు విద్య, వైద్య ఆరోగ్య, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, వ్యవసాయ, హార్టికల్చర్‌ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 అర్హులందరికీ బీమా కల్పించాలి

ప్రధానమంత్రి సురక్ష బీమా మోజన పథకంలో అర్హులైన ప్రజలందరినీ చేర్పించాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య ఐకేపీ సిబ్బందిని ఆదేశించారు. గురువారం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సింగరేణి ఇల్లందు క్లబ్‌ హౌస్‌లో బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి ప్రగతిపై ఐకేపీ, స్త్రీ నిధి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆయా పథకాల ప్రగతిపై ఐకేపీ, స్త్రీనిధి సిబ్బందితో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు లక్ష్యం మేరకు బ్యాంకు లింకేజీ రుణాలను ఈనెల చివరిలోగా అందించాలని అన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా మోజన పథకం ద్వారా రూ.12కే ఒక సంవత్సర కాలానికి రూ.2 లక్షల బీమా పొందవచ్చని ఐకేపీ సిబ్బంది మహిళా సంఘాల సభ్యులను పథకంలో చేర్పించాలని అన్నారు. సంయుక్త కలెక్టర్‌ కూరాకుల స్వర్ణలత, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హనుమంతు జె కొండిబా, ఇన్‌చార్జి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శైలజ, అడిషనల్‌ పీడీ అనిల్‌ కుమార్‌, ఎల్డిఎం, బ్యాంకర్లు, ఐకేపీ డీపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.logo