శుక్రవారం 22 జనవరి 2021
Jayashankar - Dec 03, 2020 , 01:30:25

ముగిసిన ‘చిరుతల రామాయణం’

ముగిసిన ‘చిరుతల రామాయణం’

కాటారం, డిసెంబర్‌2: చిద్నెపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దంతెలపల్లిలో గతనెల 27న ప్రారంభమైన చిరుతల రామాయణ వేడుకలు బుధవారం ముగిశాయి. పురాణా ఇతిహాసాన్ని స్థానిక భాషలో గ్రామస్తులు వివిధ పాత్రల ద్వారా ప్రదర్శించగా పలు గ్రామాల ప్రజలు తిలకించారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌ రాజమౌళి, ఎంపీటీసీ రవీందర్‌రావు, ఉపసర్పంచ్‌ తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్‌ ఊర వెంకటేశ్వర్‌రావు, చీర్ల సంతోష్‌రెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.


logo