బుధవారం 20 జనవరి 2021
Jayashankar - Dec 03, 2020 , 01:25:00

జాగిలానికి ఎస్పీ నివాళి

జాగిలానికి ఎస్పీ నివాళి

  • 12 ఏళ్లుగా పోలీస్‌ శాఖకు సేవలందించిన జూలీ
  •  అనారోగ్యంతో మృతి చెందిన శునకం

భూపాలపల్లి: విధి నిర్వహణలో అలుపెరుగని సేవలందించిన పోలీస్‌ జాగిలం జూలీ మృతి చెందగా, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, పోలీసులు నివాళులర్పించారు. ప్రాణాలకు తెగించి ఎన్నో ఆపరేషన్‌లో పాల్గొన్న శునకం అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఎస్పీ జూలీ మృతదేహానికి పూలమాల వేసి, సెల్యూట్‌ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఎనిమిదేళ్లు, గత నాలుగేళ్లుగా జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలో విధులు నిర్వహించిన జూలీ మందుపాతరలు, బాంబులు  కనిపెట్టడంలో దిట్ట అన్నారు. జిల్లాకు వీఐపీ, వీవీఐపీలు వచ్చినప్పుడు జాగిలం సేవలు కొనియాడదగినవని, జూలీ మరణం బాధాకరమన్నారు. కార్యక్రమంలోజిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐలు సంతోష్‌, సతీశ్‌, చక్రవర్తి, సీఐలు దేవేందర్‌రావు, సైదారావు, భూపాలపల్లి ఆర్‌ఎస్సైలు థామస్‌రెడ్డి, రాజు, బాంబ్‌స్కాడ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.logo