ఆదివారం 07 మార్చి 2021
Jayashankar - Dec 02, 2020 , 06:18:05

కోలాహలం.. బుగులోని సన్నిధి

కోలాహలం.. బుగులోని సన్నిధి

  •  వైభవంగా కొనసాగుతున్న జాతర
  •  వేంకటేశ్వర స్వామికి మొక్కులు సమర్పించిన భక్తులు 
  •  మార్మోగిన గోవిందనామస్మరణ

రేగొండ, డిసెంబర్‌1: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగా రం బుగులోని వేంకటేశ్వరస్వామి జాతర మంగళవారం భారీ సంఖ్యలో వచ్చిన భక్తులతో కోలాహలంగా సాగింది. తిరుమ లగిరి శివారులోని పాండవుల గుట్టలపై ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. మూడో రోజూ ఆ ప్రాంతమంతా గోవింద నా మస్మరణతో మార్మోగింది. భక్తులు స్వామి వారిని దర్శించుకొ ని మొక్కులు చెల్లించారు. బుగులోని జాతరను మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి సందర్శించి, స్వామి వారికి పూ జలు చేశారు. జాతర ఏర్పాట్లను భూపాలపల్లి ఏఎస్పీ శ్రీని వాసులు పరిశీలించి, వెంకన్నను దర్శించుకున్నారు.


VIDEOS

logo