శనివారం 16 జనవరి 2021
Jayashankar - Dec 01, 2020 , 04:45:15

అదుపులోనే కరోనా

అదుపులోనే కరోనా

డిప్యూటీ డీఎంహెచ్‌వో  కోటాచలం

మరిపెడ, నవంబర్‌ 30 : మండలంలోని ఎల్లంపేటలో కరోనా అదుపులోనే ఉందని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోటాచలం అన్నారు. వారం రోజులుగా గ్రామస్తులు కొవిడ్‌తో ఆందోళన చెందుతుండడంతో మరిపెడ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైరస్‌ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని సోమవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో సందర్శించారు. గ్రామస్తులకు చేస్తున్న పరీక్షలను దగ్గరుండీ పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామానికి చెందిన సుమారు 2వేల మందికిపైగా పరీక్షలు చేసినట్లు చెప్పారు. వైరస్‌ సోకిన వారికి కొవిడ్‌ కిట్లు అందజేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఏమాత్రం రోగ తీవ్రత పెరిగినా వెంటనే జిల్లా దవాఖానకు తరలించి చికిత్సలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

గ్రామాన్ని పంచాయతీరాజ్‌ అధికారులు స్థానిక జీపీ సిబ్బందితో ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయిస్తున్నారు. వారం క్రితం ఒకే రోజు 25 కేసులు నమోదవగా రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. వైద్యులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తు చేశారు. ఆయన వెంట మరిపెడ, ఉగ్గంపల్లి పీహెచ్‌సీ డాక్టర్లు అరుణ, రవినాయక్‌, వైద్యసిబ్బంది ఉన్నారు. ఎంపీవో పూర్ణచందర్‌రెడ్డి శానిటైజేషన్‌ పనులను పరిశీలించారు.