ప్రారంభానికి సిద్ధం

- మండలంలో మొదటగా పూర్త యిన సెగ్రిగేషన్ షెడ్
మహాముత్తారం, నవంబర్29: మండలంలోని ములుగుపల్లి గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్ (తడి, పొడి చెత్త వేరు చేసే కేంద్రం) నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ఈ షెడ్డులో తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్, గాజు సీసాలు, పేపర్ అట్టలు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, చెప్పులతోపాటు బ్యాగ్‌లు, పనికిరాని బట్టలు తదితర సామగ్రిని వేయడానికి షెడ్లో కుండీలను నిర్మించారు. షెడ్లో ఏ కుండిలో ఏమి వేయాలనేది స్పష్టంగా రాశారు. మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉండగా ములుగుపల్లి గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్ పనులు మొదట పూర్తయ్యాయి. ములుగుపల్లి సర్పంచ్ దూలం మల్లయ్యగౌడ్ మాట్లాడుతూ.. తాను ప్రత్యేక చొరవతో సెగ్రిగేషన్ షెడ్ నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ షెడ్ నిర్మాణానికి ఈజీఎస్ నిధులను ఉపయోగించామని అన్నారు. గ్రామంలోని పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
- చైనా వ్యాక్సిన్‌ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్