మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Nov 30, 2020 , 03:05:52

దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను నమ్మి మోసపోవద్దు

  • పీఏసీఎస్‌ చైర్మన్‌ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం, నవంబరు29: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని పీఏసీఎస్‌ చైర్మన్‌ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు. మండలంలోని బస్వరాజుపల్లి, గణపురం గ్రామాల్లో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సహకారంతో రైతులకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గణపురం సహకార సంఘం ఆధ్వర్యంలో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పొట్ల నగేశ్‌, స్థానిక సర్పంచ్‌ నారగాని దేవేందర్‌గౌడ్‌, బస్వరాజుపల్లి సర్పంచ్‌ చెరకు కుమారస్వామి, ఉప సర్పంచ్‌ పోతర్ల అశోక్‌యాదవ్‌, ఎంపీటీసీలు మోటపోతుల శివశంకర్‌గౌడ్‌, జంగిలి సరిత-సుధాకర్‌, సీఈవో గోవర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్లు గుర్రం సురేశ్‌, నామాల రమేశ్‌, సధాకర్‌రావు, నాయకులు వడ్లకొండ నారాయణగౌడ్‌, రాజేశ్వర్‌రావు, సాంబయ్య, మార్త శ్రీనివాస్‌, రాజయ్య పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

చిట్యాల: మండలంలోని అందుకుతండా గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ కుంభం క్రాంతికుమర్‌, సర్పంచ్‌ సిద్దంకి భాస్కర్‌ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను పొందాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ పులి విజేందర్‌రెడ్డి, ఎంపీటీసీ భూక్య సుజాత, ఏఈవో సందీప్‌ పాల్గొన్నారు.

ఏడు కొనుగోలు కేంద్రాలు..

ఏటూరునాగారం: ఏటూరునాగారం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పీఏసీఎస్‌ చైర్మన్‌ కూనూరు అశోక్‌ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దళారులను పూర్తిగా అరికట్టి రైతుల నుంచి ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నుట్లు ఆయన తెలిపారు. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని ఎక్కెల, ఆకుల వారి ఘనపూర్‌, షాపల్లి, శివ్వాపూర్‌, పప్కాపురం, రొయ్యూరు, ముప్పనపల్లిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశామని, మరో మూడు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. తుఫాన్‌ ప్రభావం తగ్గగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రభుత్వం సూచించిన విధంగా నాణ్యతతో రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన కోరారు. రైతులకు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్రాల వద్ద రైతులకు వసతి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈసారి పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఆమేరకు సెంటర్‌ ఇన్‌చార్జిలను నియమించి ధాన్యం సేకరిస్తున్నట్లు తెలిపారు. తుఫాన్‌ వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.


VIDEOS

logo