శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Nov 30, 2020 , 03:05:52

న్యాయవాదుల సంఘం జిల్లా కన్వీనర్‌ ఎన్నిక

న్యాయవాదుల సంఘం  జిల్లా కన్వీనర్‌ ఎన్నిక

భూపాలపల్లి టౌన్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా న్యాయవాదుల సంఘం అడహక్‌ కమిటీ కన్వీనర్‌గా వలబోజు శ్రీనివాసచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లాలోని న్యాయవాదులు నూతనంగా ఏర్పాటు చేయబోయే కోర్టు వద్ద సమావేశమై అడహక్‌ కమిటీ కన్వీనర్‌ను ఎన్నుకున్నారు. త్వరలోనే జిల్లా బార్‌ అసోషియేషన్‌ను ఎన్నుకుంటామని కన్వీనర్‌ శ్రీనివాసచారి తెలిపారు. కార్యక్రమంలో  జిల్లా న్యాయవాదులు ఎదులాపురం శ్రీనివాస్‌, ఒద్దుల సుదర్శన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రావు, రేగుల రాకేశ్‌, ఉడుగుల సంతోష్‌,  తిక్క ఉదయ్‌, రమేశ్‌ నాయక్‌, మంగళంపల్లి రాజ్‌కుమార్‌, కే.చిరంజీవి, రఫీ, సంగెం రవీందర్‌, పుల్యాల తిరుపతి, మల్యాల సాంబశివ, పులి వసుందర్‌, ఎస్‌కే మొహినొద్దీన్‌, ఆకుల రాము పాల్గొన్నారు.


VIDEOS

logo