గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Nov 29, 2020 , 02:58:35

విధులకు క్రమం తప్పకుండా హాజరుకావాలి

విధులకు క్రమం తప్పకుండా హాజరుకావాలి

  • భూపాలపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌

కృష్ణకాలనీ: భూపాలపల్లి మున్సిపల్‌ పరిధిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు ప్రతి రోజు క్రమం తప్పకుండా విధులకు హాజరుకావాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. శనివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలో పారిశుధ్య పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి రోజు ఎంతమంది కార్మికులు వస్తున్నారో తెలుసుకుని హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ

భూపాలపల్లి పట్టణం పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికులతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి వీధిలో మురికి కాలువలను శుభ్రం చేస్తూ, రోడ్లపై చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. ఏమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కమిషనర్‌ వెంట మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు. 


VIDEOS

logo