అక్రమ దందాలపై పోలీసుల నజర్

- ప్రైవేట్ ఫైనాన్స్, అధిక వడ్డీ వ్యాపారులకు కౌన్సెలింగ్
- ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్ట
- పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుపై దృష్టి
- గుట్కా, అంబర్ విక్రయాల కట్టడికి చర్యలు
జయశంకర్ భూపాలపల్లి,నమస్తేతెలంగాణ: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమ దందా, చీకటి వ్యాపారాలపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులు అధిక వడ్డీ వసూళ్లపై గణపురం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ప్రత్యేక చొరవ చూపుతూ వడ్డీ వ్యాపారులను సమావేశ పరిచి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. గణపురం మండలంలో బెల్ట్ షాపుల నిర్వహణను కొనసాగించరాదని, బెల్ట్ షాపులను మూసి వేయించినట్లు సమాచారం. జిల్లాలో అక్రమ ఇసుక తరలింపును అడ్డుకోవాలని పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు విజప్తి చేస్తున్నట్లు తెలిసింది. మల్హర్ మండలంలోని మానేరు, చలివాగులతో పాటు మోరంచ తదితర వాగుల నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూ వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో ఇసుక అవసరమున్న స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణ భారీగా సాగుతోంది గణపురం మండలంలోని కొత్తపల్లివద్ద గురువారం 400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకొని వ్యాపారులను అరెస్ట్ చేశారు.
అక్రమ ఇసుక, పీడీఎస్ బియ్యం దందాపై ఉక్కు పాదం
పీడీఎస్ బియ్యాన్ని మహదేవ్పూర్ మండలంలోని అంతర్ రాష్ట్ర వంతెన నుంచి అక్రమార్కులు మహరాష్ట్ర, సిరోంచ, ఆసరవెళ్లి, చత్తీస్గడ్ తదితర ప్రాంతాలకు తలరిస్తున్నట్లు సమాచారం. గణపురం, మహదేవ్పూర్, రేగొండ, చిట్యాల కేంద్రాలుగా పీడీఎస్ బియ్యం రవాణా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఇటీవల గణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోట్రైనీ ఐపీఎస్ ఐదు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశారు. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో ములుగు జిల్లా గుట్కా వ్యాపారి
జిల్లాలో గుట్కా, అంబర్ ప్యాకెట్ల అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జిల్లాలో ములుగు జిల్లాకు చెందిన కిరాణ షాపు వ్యాపారి గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తుండగా పోలీసులు అదుపులో తీసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిసంది. రెండు రోజులుగా పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో సాగుతున్న అక్రమ దందాలను అరికట్టేందుకు ట్రైనీ ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారించటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- ఖమ్మంలో భారీగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత
- 60 ట్రాక్టర్ల ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు
- ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌కు బెదిరింపులు
- ఆవిష్కరణల హైదరాబాద్.. సౌరవిద్యుత్‌లో బాగుబాగు
- రన్ వే పై చిరుత రయ్.. రయ్...! వీడియో వైరల్... !
- విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండా : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
- మరో 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో..ప్రీ-బుకింగ్స్ ప్రారంభం
- వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజల్
- సహారా ఎడారిలో ఈ వింత చూశారా?
- బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం