శనివారం 16 జనవరి 2021
Jayashankar - Nov 28, 2020 , 03:06:40

ప్రోయాక్టివ్‌ పోలీసింగ్‌పై దృష్టిసారించాలి

 ప్రోయాక్టివ్‌ పోలీసింగ్‌పై దృష్టిసారించాలి

  • అదనపు ఎస్పీ శ్రీనివాసులు 

భూపాలపల్లి: జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది  సంఘటన జరిగిన తర్వాత రియాక్టివ్‌ పోలీసింగ్‌ కంటే సంఘటన జరగక ముందే పసిగట్టి నివారించగలిగే ప్రోయాక్టివ్‌ పోలీసింగ్‌ పై దృష్టిసారించాలని  అదనపు ఎస్పీ శ్రీనివాసులు అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం పోలీస్‌ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నమోదైన వివిధ కేసుల వివరాలు, దర్యప్తు, పురోగతి వంటి అంశాలపై చర్చించారు. పెండింగ్‌ కేసుల దర్యప్తు పూర్తి చేసి నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలన్నారు. కేసుల విచారణ సమయలో సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి నిందితులకు కఠిన శిక్ష పడేలా సాక్ష్యాలు సేకరించాలరి సూచించారు.

పోలీస్‌శాఖ ఉపయోగిస్తున్న నూతన టెక్నాలజీ, అధునాతన టెక్నాలజీపై అధికారులు, సిబ్బందికి అవగాహన ఉండాలన్నారు. జిల్లాలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలకు పాల్పడితే సహించేది లేదని, చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేఖమైన కార్యకలపాలు, అక్రమ దందాలు, అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా వేయాలన్నారు.పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్‌రావ్‌, బోనాల కిషన్‌, శిక్షణ ఐపీఎస్‌ సూధీర్‌రామ్‌నాథ్‌ కేకాన్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.