మంగళవారం 26 జనవరి 2021
Jayashankar - Nov 27, 2020 , 01:18:28

181 మహిళా హెల్ప్‌లైన్‌పై అవగాహన కల్పించాలి

181 మహిళా హెల్ప్‌లైన్‌పై అవగాహన కల్పించాలి

కృష్ణకాలనీ, నవంబర్‌ 26: ప్రతి గ్రామంలోని మహిళలకు 181 మహిళా హెల్ప్‌లైన్‌పై అవగాహన కల్పించాలని భూపాలపల్లి సంయుక్త కలెక్టర్‌ కూరాకుల స్వర్ణలత సఖీ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రాన్ని డీడబ్ల్యూవో శ్రీదేవితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సఖీ కేంద్రంలోని కేసుల వివరాలు, 181 కాల్స్‌, వైద్యం, కౌన్సెలింగ్‌, సిబ్బంది హాజరు రిజిష్టర్లను తనిఖీ చేశారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలోని మహిళందరికీ  హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 181పై అవగాహన కల్పించాలని అన్నారు. సఖీ కేంద్రం ఉపయోగాలను తెలియాజేయాలన్నారు. గురువారం అనుకోకుంగా సఖీ కేంద్రంలో ఓ బాధితురాలు ఉండగా జిల్లా సంయుక్త కలెక్టర్‌ స్వయంగా ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని కౌన్సిలింగ్‌ చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తానని జేసీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సఖీ కేంద్రం ఎన్‌జీవో శ్రీరాంరెడ్డి, కేఎస్సార్‌ ట్రస్ట్‌ ఇన్‌చార్జి పిక్కల సారయ్య, డీడబ్ల్యూవో సీనియర్‌ అసిస్టెంట్‌ పూర్ణచందర్‌, సఖీ అడ్మిన్‌ గాయత్రి, సిబ్బంది పాల్గొన్నారు.  logo