కదం తొక్కిన కార్మిక లోకం

- భూపాలపల్లి బొగ్గు గనుల్లో సమ్మె సంపూర్ణం
- అత్యవసర సిబ్బంది మినహా సమ్మెలో పాల్గొన్న కార్మికులు
- బోసిపోయిన బొగ్గు గనులు
భూపాలపల్లి/ములుగు/టేకుమట్ల/ గోవిందరావుపేట /వెంకటాపురం (నూగూరు) /ఏటూరునాగారం/ వాజేడు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె భూపాలపల్లి బొగ్గు గనుల్లో సంపూర్ణంగా జరిగింది. అత్యవసర సిబ్బంది మినహా, సింగరేణి కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో బొగ్గు గనులు బోసిపోయాయి.
గురువారం కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో 8వేల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తికి విఘాతం కల్గింది. అవాంచనీయ సంఘటనలు జరుగకుండా గనుల వద్ద భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు నేతృత్వంలో భూపాలపల్లి, చిట్యాల సీఐలు వాసుదేవరావు, సాయిరమణ, భూపాలపల్లి, గణపురం, రేగొండ, మొగుళ్లపల్లి, టేకుమట్ల ఎస్సైలు అభినవ్, రాజన్‌బాబు, కృష్ణప్రసాద్, మహేందర్, రమణారెడ్డి ఆధ్వర్యంలో 85 మంది సివిల్, స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. సమ్మె జరుగుతున్న తీరును గనుల వద్ద భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం ఈ.సీహెచ్ నిరీక్షన్రాజ్, ఎస్వోటూ జీఎం జి.రఘుపతి, ఏజీఎం (ఐఈడీ) జోతి,డీజీఎం(పర్సనల్) మంచాల శ్రీనివాస్ పర్యవేక్షించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా కార్మికులు ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి ఏరియాలో గురువారం మొదటి షిఫ్ట్‌లో గనులు, డిపార్ట్మెట్లలో కలిపి 3535మంది కార్మికులు విధులకు హాజరు కావాల్సి ఉండగా, 589 మంది అత్యవసర సిబ్బంది, కార్మికులు విధులకు హాజరయ్యారని, 97 మంది కార్మికులు సెలవులో ఉన్నారని, 500 టన్నుల బొగ్గు ఓసీపీ-2 గనిలో ఉత్పత్తి అయిందని, రెండో షిఫ్ట్‌లో గనులు, డిపార్ట్మెట్లలో కలిపి 1205 మంది కార్మికులు విధులకు హాజరు కావాల్సి ఉండగా, 182 మంది అత్యవసర సిబ్బంది, కార్మికులు విధులకు హాజరయ్యారని భూపాలపల్లి సింగరేణి ఏరియా అధికార ప్రతినిధి మంచాల శ్రీనివాస్ తెలిపారు.ములుగు జిల్లా కేంద్రం బంద్ పాక్షికంగా జరిగింది. టేకుమట్ల, గోవిందరావుపేట, వెంకటాపురం (నూగూరు), ఏటూరునాగారం, వాజేడు తదితర మండలాల్లో బంద్ నిర్వహించారు. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు వివిధ వర్గాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు , అంగన్వాడీ, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కాయిర్ బోర్డ్ సభ్యుడిగా టిఫ్ జాయింట్ సెక్రటరీ గోపాల్‌రావు
- వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- 87 లక్షలు పెట్టి ఇల్లు కొని.. భారీ సొరంగం తవ్వి.. వెండి చోరీ
- ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామాకు సిద్ధం
- కొవిడ్-19పై అప్రమత్తత : రాష్ట్రాలకు కేంద్రం లేఖ!
- ఐపీఎల్- 2021కు ఆతిథ్యమిచ్చే నగరాలు ఇవేనా?
- అలిపిరి నడకమార్గంలో భక్తుడు గుండెపోటుతో మృతి
- చైనాకు అమెరికా బాకీ.. ఎంతంటే..?
- పొరపాటున గన్‌తో వ్యక్తి కాల్పులు.. మరణించిన మేనల్లుడు
- కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలయ్యిందా..?