మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Nov 25, 2020 , 06:20:52

26న విధులకు హాజరు కావాలి

26న విధులకు హాజరు కావాలి

భూపాలపల్లి, నవంబర్‌24: ఈనెల 26న సమ్మెలో పాల్గొనకుండా సింగరేణి కార్మికులందరూ విధులకు హాజరుకావాలని భూపాలపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ నిరీక్షణ్‌రాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. బొగ్గుగని తవ్వకాలను కమర్షియల్‌ చేయడం, కోల్‌ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ, సింగిరేణి పరిధిలో లేని మొదలలైన విషయాలపై అనవసరంగా సమ్మెలో పాల్గొనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఒకరోజు సమ్మె చేస్తే కంపెనీకి రూ.53 కోట్ల నష్టం వస్తుందని, కార్మికులు ఒక రోజుకు రూ.20 కోట్ల వేతనాలను సింగరేణి వ్యాప్తంగా కోల్పోతారని పేర్కొన్నారు. ఈ ఏడాది కరోనా కాలంలోని ఉత్పత్తి లక్ష్యాలను అందుకోవడానికి శ్రమిస్తున్న కార్మికులు ఇప్పుడు సమ్మెలో పాల్గొంటే అధిక నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కార్మికులు విధులకు హాజరై, సంస్థకు నష్టం కలుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

VIDEOS

logo