మోతాదుకు మించి ఎరువులు వాడద్దు

జైపూర్ : రైతులు పంటలపై మోతాదుకు మించి ఎరువులు వాడవద్దని జిల్లా వ్యవసాయాధికారి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కుం దారంలో మంగళవారం రైతులు, శాస్త్రవేత్తల చర్చాగోష్ఠి కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. వరి కాకుండా ఇతర పంటలపై దృష్టి సారించాలని పేర్కొ న్నారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఎరువులు వినియోగించాలని కోరారు. రైతుల సందేహాలకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సమాధానమిచ్చారు. సర్పంచ్ సమ్మ య్య, ఎంపీటీసీ రాచర్ల సతీశ్, కృషి విజ్ఞాన్ కేంద్రం బెల్లంపల్లి శాస్త్రవేత్తలు రామేశ్వర్నాయక్, ఏవో మార్క్ గ్లాడ్సన్, ఏఈవోలు అఖిల్, తదితరులు పాల్గొన్నారు.
కల్లం నిర్మాణానికి భూమిపూజ
బెల్లంపల్లిరూరల్ : మండలంలోని తాళ్లగురిజాల గ్రామంలో మంగళవారం రైతు కల్లానికి ఏడీఏ సురేఖ, వ్యవసాయాధికారులు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భం గా ఏడీఏ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి ప్రభు త్వం రైతు కల్లాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొ న్నారు. సర్పంచ్ గాజుల రంజిత, ఏవో సుద్దాల ప్రేమ్‌కుమార్, హెచ్‌వో సీహెచ్ సుప్ర జ, ఏఈవో శ్రీనివాస్, నాగదీప్తి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, నాయకులు గాజుల వెంకటేశ్వర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్ : మండలంలోని కొమ్మె ర గ్రామంలో కల్లాల నిర్మాణాలపై వ్యవసాయ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మల్లేశం మాట్లాడుతూ కొమ్మె రలో 25 మంది రైతులకు కల్లా ల నిర్మాణానికి అనుమతి వచ్చిందని తెలిపారు. రైతులు కల్లాల నిర్మాణాలను వెంటనే రైతులకు సూచించా రు. ఎంపీవో బీరయ్య, ఏఈవో సాగర్, నాయకులు తాళ్లపెళ్లి కిరణ్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, సంతోష్‌గౌడ్, మం త్రి మల్లేశ్, జనగామ మల్లేశ్ ఉన్నారు.
తాజావార్తలు
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
- టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!
- మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
- నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల పట్టివేత
- సినిమా టికెట్ ధరల పరిస్థితి ఏంటి..తగ్గిస్తారా, కొనసాగిస్తారా..?
- కేంద్ర ప్రతిపాదనపై రైతుల విముఖత
- సూర్య సినిమాకు అవమానం జరిగిందా..!