శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Nov 24, 2020 , 03:29:20

ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయాలి

ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయాలి

  •  ప్రజావాణి దరఖాస్తులను నాలుగు రోజుల్లోగా పరిష్కరించాలి
  • అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

భూపాలపల్లి కలెక్టరేట్‌, నవంబర్‌ 23 : జిల్లాలోని ప్రభు త్వ అధికారులు, సిబ్బంది నేటి నుంచి (మంగళవారం) ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఆన్‌లైన్‌లో హాజ రు నమోదు చేయడానికి కలెక్టర్‌ ఈ - అటెండెట్స్‌ యాప్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో ఎలా అటెండె న్స్‌ నమోదు చేయాలో టెక్నికల్‌ పర్సన్‌ జిల్లా అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ  అటెండెన్స్‌ యాప్‌ను ప్రభుత్వ అధికారులు డౌన్‌లోడ్‌ చేసుకొని నే టి నుంచి యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. ఈ యాప్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగి కార్యాలయం నుంచే కా కుండా ఫీల్డ్‌ విజిట్‌కు వెళ్లిన సమయంలో అక్కడి నుంచి కూ డా హాజరు నమోదు చేయవచ్చన్నారు. వ్యక్తిగత సెలవులు కూడాయాప్‌ ద్వారా తీసుకోవచ్చని సూచించారు. గతంలో నిర్వహించిన ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఆర్జీలను నాలు గు రోజుల్లోగా పరిష్కరించి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్‌, కలెక్టర్‌ కార్యాలయ ఏవో మహేశ్‌బాబు, డీబీసీడీ శైలజ, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శశిధర్‌ రెడ్డి, పంచాయతీ రాజ్‌ ఈఈ రాంబాబు, జడ్పీ సీఈవో నాగపద్మజ, డీఎస్సీడీవో సు నీత, ఆర్టీసీ డీఎం లక్ష్మీధర్మ, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఉమాదేవి, డీపీఆర్వో రవికుమార్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్‌, జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి వెంకటేశ్వ ర్లు, ఈఈ ఆర్‌డబ్ల్యూఎస్‌ నిర్మల, అధికారులు పాల్గొన్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశీలన

ఎలక్ట్రికల్‌ చార్జింగ్‌ ద్విచక్ర వాహనాన్ని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్‌ వారు తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్‌ వాహనం బ్యాటరీని మూడు గంటలు చార్జింగ్‌ చేస్తే 80 నుంచి 120 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చని ఎగ్జిక్యూటివ్‌ సురేశ్‌కుమార్‌ తెలిపారు. వాహనంలో నుంచి బ్యాటరీని తీసి చార్జింగ్‌ పెట్టుకోవచ్చన్నా రు. వాహనం ధర రూ.79,999 ఉంటుందని కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయ పరిసరాలను పరిశీలించి పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కార్యాలయ ఏవోను కలెక్టర్‌ ఆదేశించారు.

VIDEOS

logo