కుల వృత్తులకు సీఎం కేసీఆర్ వరాలు

- సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్లకు కరంట్ ఫ్రీ
- ఉచిత విద్యుత్ సరఫరాపై హర్షాతిరేకాలు
- ఆనందం వ్యక్తం చేస్తున్న వర్తక, వ్యాపారులు
జయశంకర్భూపాలపల్లి,నమస్తేతెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించారు. ప్రధానంగా నాయీబ్రాహ్మణులు, రజ క సామాజిక ప్రజలకు ఆయన కానుకలు ప్రకటించారు. సె లూన్లు, లాండ్రీలు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. అవసరమైన చోట అధునాతనమైన దోబీఘాట్లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. దీంతో ఆయా వృత్తుల్లో స్థిరపడిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 72 సెలూ న్లు, 65 లాండ్రీ షాపులు, ములుగు జిల్లాలో 35 సెలూన్లు, 30కి పైగా లాండ్రీ షాపుల నిర్వాహకులకు ఎంతో మేలు జరుగనుంది. దీంతో ఆయా వర్గానికి చెందిన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాయీబ్రాహ్మణులు, రజక సామాజిక ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నారు.
జ యశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని 26 రకాల వర్తక, వ్యాపార సంస్థలకు చెందిన వారు మార్చి నుంచి డిసెంబర్ వరకు విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తామని ప్రకటించటంతో పాటు స్లాబ్ రేట్లలోనూ మార్పులకు అనుమతించడం హర్షణీయమని అంటున్నారు. జయశంకర్ భూపాలపల్లిలో 2, ములుగు జిలాల్లో 2 సినిమా హాళ్లు తెరుచుకోవడంతో పాటు 50 శాతం ప్రేక్షులకు అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా టికెట్ రేట్లను పెంచుకునే వెసు లుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. దీంతో సినిమా హాళ్ల యాజమాన్యాలతో పాటు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం..
గోవిందరావుపేట : ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ చిరకాల కోరిక నేడు నెరవేరింది. డిసెంబర్ నుంచి సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ అందిస్తామ ని కేసీఆర్ సార్ ప్రకటించడం అభినందనీయం. ఉచిత విద్యుత్‌తో నెలకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఆదా అవుతుంది.
- సన్నాయిల భిక్షపతి, క్షౌరవృత్తిదారుడు/ చల్వాయి
తాజావార్తలు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్‌లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి
- కళాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాలి
- విద్యుత్ వినియోగం..క్రమంగా అధికం!
- బీజేపీ ఇస్తామన్న ఉద్యోగాలు ఎక్కడ..?