గురువారం 03 డిసెంబర్ 2020
Jayashankar - Nov 22, 2020 , 02:16:01

పాండవుల గుట్టకు ఛలో..ఛలో..

పాండవుల గుట్టకు ఛలో..ఛలో..

  • మొదలైన రాక్‌ ైక్లెంబింగ్‌, ట్రెక్కింగ్‌
  • శనివారం నుంచే ప్రారంభం
  • సందడి చేస్తున్న పర్యాటకులు

రేగొండ, నవంబరు 21: ప్రకృతి సహజ సిద్ధమైన గుట్టలు, పచ్చని చెట్లు, పర్యాటకులను కనువిందు చేసే ఆహ్లాదకర వాతావరణం కలిగిన పాండవుల గుట్టల్లో రాక్‌ ైక్లెంబింగ్‌, ట్రెక్కింగ్‌ మొదలైంది. కరోనా వైరస్‌ నేపథ్యం లో పర్యాటకులు ఎవరూ రాకపోవడంతో విన్యాసాలు నిలిచిపోయాయి. డీఎఫ్‌వో ఆదేశాల మేరకు మండలంలోని తిరుమ లగిరి శివారులోని పాండవుల గుట్టల్లో ఎకో టూరిజం, అటవీ శాఖ ఆధ్వర్యంలో రాక్‌ ైక్లెంబింగ్‌, ట్రెక్కింగ్‌ శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పర్యాటకులు గుట్టల వద్ద సందడి చేశారు. విన్యాసాలు చేసి రాతి శిల్పాలు, గుట్టల చరిత్రను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి శని, ఆదివారాల్లో ైక్లెంబింగ్‌ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌, ఎఫ్‌డీవో వజ్రారెడ్డి, ఎఫ్‌ఆర్‌వో నాగరాజు, ఎఫ్‌ఎస్‌వో ప్రసాదరావు, ఇన్‌స్ట్రక్టర్స్‌ భాస్కర్‌, శ్రీకాంత్‌, భరత్‌రాజ్‌, రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.