ఆర్థిక సహకారంతోనే అభివృద్ధి

- ప్రతి నెలా ప్రగతి నివేదికలు అందించాలి
- నీతి ఆయోగ్ అధికారి సంజయ్‌కుమార్
భూపాలపల్లి కలెక్టరేట్: నీతి ఆయోగ్ ఆర్థిక సహకారంతో ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ అధికారి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో విద్య, వైద్యం, పౌష్టికాహార కల్పన, నైపుణ్య శిక్షణ, వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి నీతి ఆయోగ్ సహకారం అందిస్తుందన్నారు. ఆయా రంగాల అభివృద్ధికి గతంలోనే రూ.10కోట్లు మంజూరు చేశామన్నారు. అభివృద్ధి నివేదికలను ఎప్పటికప్పుడు నీతి ఆయోగ్‌కు అందజేయాలని అధికారులను ఆదేశించారు. 2019 మార్చిలో జిల్లా దేశస్థాయిలో అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృద్ధి సూచికలో మొదటి స్థానాన్ని పొందిందని, అదే విధంగా ప్రతి నెలా అభివృద్ధి నివేదికలను అందజేసి జిల్లా అభివృద్ధికి మరింత సహకారం తీసుకోవాలని అన్నారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
అనంతరం కలెక్టర్ కృష్ణ ఆదిత్య సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయా రంగాల అభివృద్ధికి అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. ప్రగతి నివేదికలను ప్రతి నెలా 5వ తేదీలోగా అందజేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీవో శామ్యూల్, ఇన్చార్జి డీఆర్డీవో శైలజ, నీతి ఆయోగ్ జిల్లా కో ఆర్డినేటర్ రాహుల్, జిల్లా విద్యా శాఖ అధికారి హైదర్హై, జడ్పీసీఈవో నాగపద్మజ, జిల్లా మత్స్య శాఖ అధికారి భాస్కర్, ఈఈ ఆర్డబ్ల్యూఎస్ నిర్మల, ఎస్బీఎం కో ఆర్డినేటర్ వెంకటేశ్, సీడీపీవో అవంతిక, ములుగు జిల్లా విద్యా శాఖ అధికారి వాసంతి, డీడబ్ల్యూవో ప్రేమలత పాల్గొన్నారు.
తాజావార్తలు
- బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు వద్దు
- లావణ్య త్రిపాఠి ఎంటర్టైనింగ్ పర్సన్: రామ్
- కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోను : హర్యానా మంత్రి అనిల్ విజ్
- ఎన్నికల కోడ్ ఉందని చంద్రబాబుకు తెలియదా?
- డబ్బు, నగల కోసం వృద్ధురాలు దారుణ హత్య.!
- సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలి
- వామపక్షాల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జి ..వీడియో
- మేడిన్ ఇండియా వ్యాక్సిన్ తీసుకున్న నేపాల్ ఆర్మీ చీఫ్
- బాలిక డ్రెస్ పట్ల అభ్యంతరం.. స్కూల్ నుంచి ఇంటికి పంపివేత
- పెద్దగట్టు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి జగదీశ్ రెడ్డి