సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Nov 20, 2020 , 03:21:16

ఆ పాదముద్రలు పులివి కావు

ఆ పాదముద్రలు పులివి కావు

భూపాలపల్లి: గొర్లవీడు శివారులో లభించిన పాదముద్రలు పులివి కావని భూపాలపల్లి ఇన్‌చార్జి ఎఫ్‌డీవో వజ్రారెడ్డి గురువారం తెలిపారు. భూపాలపల్లి మండ లం గొర్లవీడు శివారులో(తానికుంట సమీపంలో) బొల్లవోని బాలు మిరుప తోటలో గురువారం పాదముద్రలు కనపడ్డాయి. రైతులు వాటిని పులి అడుగులుగా భావించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గొర్లవీడు అటవీ బీట్‌ ఆఫీసర్‌ వేణు మిరుప తోట వద్దకు వెళ్లి పాదముద్రల ఫొటోలు తీసి జిల్లా, డివిజన్‌ అటవీ అధికారులకు పంపించారు. పాదముద్రలు పులివి కావని హైనావని గుర్తించినట్లు ఎఫ్‌డీవో వజ్రారెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.

VIDEOS

logo