మంగళవారం 09 మార్చి 2021
Jayashankar - Nov 19, 2020 , 03:02:44

కొయ్యూరు ఎస్సైకి ప్రశంసా పత్రం

కొయ్యూరు ఎస్సైకి ప్రశంసా పత్రం

మల్హర్‌: రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ శాఖలో సమర్థ్ధవంతమైన విధులు నిర్వర్తించినందుకు డీజీపీ ప్రకటించిన అవార్డుల్లో భాగంగా కొయ్యూరు ఎస్సై సత్యనారాయణ ప్రశంసలు అందుకున్నారు. 2019లో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని కేశవపట్నం ఎస్సైగా పని చేసిన సందర్భంలో వివిధ నేరాల పరిశోధన, కేసులను ఛేదించడం, దొంగతనాలను అరికట్టడంలో సమర్ధవంతంగా పనిచేసినందుకు కరీంనగర్‌ సీపీ చేతుల మీదుగా ఎస్సై ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌, కాటారం సీఐ హథీరాంలు ఎస్సైని అభినందించారు. ఇదే స్ఫూర్తితో పని చేస్తూ పోలీస్‌ శాఖకు మంచి పేరు తేవాలని కోరారు. 


VIDEOS

logo