గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Nov 19, 2020 , 03:02:44

జీహెచ్‌ఎంసీ 6వ డివిజన్‌ ఇన్‌చార్జిగా ఎమ్యెల్యే గండ్ర

జీహెచ్‌ఎంసీ 6వ డివిజన్‌  ఇన్‌చార్జిగా ఎమ్యెల్యే గండ్ర

జయశంకర్‌ భూపాలపల్లి, నమస్తేతెలంగాణ: డిసెంబర్‌1న జరుగనున్న సీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ డివిజన్లకు పార్టీ ఎన్నికల ఇన్‌చార్జులను బుధవారం నియమించారు. మల్కాజ్‌గిరి పార్లమెంటరీ  నియోజకవర్గం ఉప్పల్‌ శాసన సభ నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్‌  నాచారం స్థానంలో పోటీ చేసే   అభ్యర్థి విజయం కోసం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమిస్తూ సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ  ఎన్నికలకు సమయం గడువు తక్కువగా ఉన్నందున పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగుతామని తెలిపారు. 


VIDEOS

logo