సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Nov 19, 2020 , 02:52:48

‘ఈ ఆఫీస్‌'పై అవగాహన కలిగి ఉండాలి

‘ఈ ఆఫీస్‌'పై అవగాహన కలిగి ఉండాలి

కలెక్టర్‌ కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య 

భూపాలపల్లి కలెక్టరేట్‌, నవంబర్‌ 18: ఈ-ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రతి ఉద్యోగి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ కార్యాలయ సిబ్బందికి ఈ-ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. సమర్థవంతంగా ఫైళ్ల నిర్వహణ చేయడానికి ఈ-ఆఫీస్‌ పద్ధతి చాలా అనుకూలమైనదని అన్నారు. ఈ పద్ధతిలో ఫైళ్ల నిర్వహించడం ద్వారా ఫైళ్ల మూమెంట్‌లో ఆలస్యాన్ని నిరోధించవచ్చని అన్నారు. పైల్‌ రూపొందించడంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి స్థాయిలో సంబంధిత సెక్షన్‌ అధికారులు రిమార్కులు రాస్తూ ఆ పైల్‌ ఉద్దేశాన్ని క్లుప్తంగా రాయాలని సూచించారు. ప్రతి ఉద్యోగి ఈఆఫీస్‌ పద్ధతిలో ఫైళ్ల మూమెంట్‌పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలోని వివిధ సెక్షన్లను పరిశీలించారు. కలెక్టర్‌ కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఏవో మహేశ్‌బాబుకు సూచించారు. శిక్షణ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ కూరాకుల స్వర్ణలత, కలెక్టర్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్లు రామరావు, రవికుమార్‌, ఈడీఎం శ్రీకాంత్‌, వివిధ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు.


VIDEOS

logo