శనివారం 06 మార్చి 2021
Jayashankar - Nov 19, 2020 , 01:59:31

హోటళ్లు, దుకాణాల వద్ద శుభ్రత పాటించాలి

హోటళ్లు, దుకాణాల వద్ద శుభ్రత పాటించాలి

  • రోడ్లపై చెత్త వేస్తే షాపులను సీజ్‌ చేస్తాం 
  • డీపీవో   నారాయణ

నెన్నెల: హోటళ్లు, వ్యాపార సముదాయాల వద్ద పరిశుభ్రత పాటించాలని, లేదంటే జరిమానాతో పాటు సీజ్‌ చేస్తామని యజమానులను డీపీవో నారాయణ హెచ్చరించారు. నెన్నెలలో దుకాణా లు, హోటళ్ల ముందు చెత్తకుప్పలను ఆయన బుధవారం పరిశీలించారు. ఓ హోటల్‌ వద్ద చెత్తకుప్పలు, మురుగునీటి గుంతలు ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2 వేలు జరిమానా విధించారు. స్వీట్‌ హౌస్‌ ముందు చెత్త కుప్పలు, ప్లాస్టిక్‌ కవర్లు పడేయడంతో రూ. వెయ్యి జరిమానా విధించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసిన వారికి రూ.10 వేల జరిమానా విధించాలని, చెల్లించలేదంటే నోటీసులు ఇచ్చి దుకాణాలను సీజ్‌ చేయాలని సర్పంచ్‌ తోట  సుజాతను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లోనే చెత్తను వేయాలని సూచించారు. చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. బంజరుదొడ్డిలో ఉన్న పశువులను చూసి, వాటికి మేత, నీటిని అందించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీఎల్‌పీవో ఫణీందర్‌, ఎంపీవో మహేశ్‌, ఉప సర్పంచ్‌ పుప్పాల అంజన్న, శ్రీనివాస్‌ ఉన్నారు.


VIDEOS

logo