ఫైళ్ల నిర్వహణ సక్రమంగా ఉండాలి

కలెక్టర్ కృష్ణ ఆదిత్య
జిల్లా కార్యాలయాల తనిఖీ
రికార్డుల పరిశీలన
భూపాలపల్లి కలెక్టరేట్, నవంబర్ 17: ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలోని మైనారిటీ సంక్షేమ శాఖ, ప్రణాళిక, పౌరసంబంధాలు, పౌరసరఫరాలు, పంచాయతీ, బీసీ అభివృద్ధి, ఎస్సీ అభివృద్ధి తదితర శాఖల కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఫైళ్ల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల కార్యాలయాల్లో వివిధ కార్యక్రమాల ఫైళ్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని అన్నారు. కార్యక్రమాల వారీగా ఒక్కొక్క కార్యక్రమానికి ఒకటే ఫైల్‌ను అనుసరించాలని అన్నారు. అన్ని ఫైళ్లను ఆన్లైన్లో నమోదు చేసి పేపర్ రహితంగా ఈ- ఆఫీస్ పద్ధతిలో విధులు నిర్వహించాలని అన్నారు. అధికారులు సమయ పాలన పాటించాలని, కార్యాలయాల్లో అవసరమైన వస్తువులను మాత్రమే ఉంచుకొని కార్యాలయాన్ని ప్రతి రోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి రవికుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పనులు త్వరగా పూర్తి చేయండి
రైతు వేదికలు, వైకుంఠధామాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతు వేదికలు, వైకుంఠధామాల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు, వైకుంఠధామాల నిర్మాణాలు జిల్లాలో ఆశించిన మేరకు వేగంగా పని కొనసాగడం లేదని, ఇకనైనా అధికారులు దృష్టి సారించి ప్రతి రోజూ పర్యవేక్షించి వేగంగా పూర్తి చేయించాలని అన్నారు. నిర్మాణ ప్రగతిను ఫొటోల ద్వారా ప్రతి రోజూ అందించాలని అన్నారు. పల్లెప్రకృతి వనాల ఏర్పాటు పనులను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. వైకుంఠధామాలను అటవీ భూముల్లో నిర్మించేందుకు అనుమతులు ఉన్నందున ప్రభుత్వ భూమి అందుబాటులో లేని గ్రామాల్లో అటవీ భూముల్లో నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. చెరువు శిఖం, వివాదంలో ఉన్న భూములు, సరైన రహదారులు లేని భూముల స్థానంలో వేరే భూములను గుర్తించేందుకు తహసీల్దార్లకు లేఖలు రాయాలని ఆదేశించారు. సమావేశంలో ఈఈ రాంబాబు, డీఈ సాయిలు, వెంకటేశ్వర్లు, ఆత్మారాం, ఏఈలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ
- పీఎఫ్ వడ్డీరేటు 8.5 శాతమే
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్