10,068 మందికి ఆస్తి పన్ను రాయితీ

మున్సిపాలిటీలో ఇప్పటికే చెల్లించిన వారు 5,568
చెల్లించాల్సిన వారు 4,500 మంది
చెల్లించిన యజయానులకు 2021-22 సంవత్సరానికి వర్తింపు
జయశంకర్ భూపాలపల్లి, నమస్తేతెలంగాణ: ప్రభుత్వం ఆస్తి పన్నులో 50 శాతం రాయితీని ప్రకటించడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.10వేల లోపు ఆస్తి పన్ను చెల్లిస్తున గృహాల యజమానులకు 50 శాతం ఆస్తి పన్ను రాయితీని రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించిన విషయం విదితమే.. దీంతో జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటి పరిధిలో 10,068 గృహ యజమానులకు 50 శాతం ఆస్తి పన్ను రాయితీ వర్తించనుంది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 10,068 యజమానుల్లో ఇప్పటికే 5,568 మంది యజమానులు రూ.కోటీ 15లక్షల 75వేల ఆస్తి పన్నును మున్సిపాలిటీకి ఇప్పటికే చెల్లించారు. మిగతా 4,500 మంది యజమానులు ఆస్తి పన్ను రూపంలో చెల్లించాల్సిన మొత్తం రూ. కోటీ 11లక్షల 57వేలు మాత్రమే బకాయీ ఉన్నట్లు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. మున్సిపల్ పరిధిలో రూ.10వేల లోపు ఆస్తి పన్ను చెల్లిస్తున్న గృహ యజమానులకు 50 శాతం ఆస్తి పన్ను రాయితీ ఎంతో ఊరట నిచ్చేదిగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికే 5,568 గృహాల యజమానుల నుంచి ఆస్తి పన్నుల రూపంలో రూ. కోటీ 15లక్షల 75వేలను వసూలు చేయగా మిగిలిన 4,500 మంది నుంచి వసూలు చేయాల్సిన బకాయి రూ.కోటీ 11లక్షల 57వేలు ఉంది. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం రాయితీతో మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూలు 50 శాతం తగ్గనుంది. జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం ప్రకటించిన 50 శాత గృహాల ఆస్తి పన్నును ఇప్పటికే చెల్లించిన 5,568 మంది గృహ యజమానులకు వచ్చే ఆర్థిక సంవత్సర 2021-22నకు సర్దు బాటు చేయన్నుట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే చెల్లించిన గృహాల యజమానులు వచ్చే సంవత్సరం తమ ఆస్తి పన్నులను సర్దుబాటు చేసుకోవాలని అధికారులు తెలియ చేస్తున్నారు. బకాయి ఉన్న 4,500 మంది గృహా యజమానులు మాత్రం ప్రభుత్వం కల్పించిన పన్ను రాయితిని ఉపయోగించుకొని సకాలంలో ఆస్తి పన్నులను చెల్లించాలని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
- సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతి