ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Nov 16, 2020 , 07:02:30

సహకార వారోత్సవాలు ప్రారంభం

సహకార వారోత్సవాలు ప్రారంభం

కాటారం, నవంబర్‌ 15 : మండలకేంద్రంలో 67వ సహకార వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం ఎదుట వైస్‌ చైర్మన్‌ దబ్బెట స్వామి సహకార జెండా ఎగురవేసి వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పీఏసీఎస్‌ ద్వారా రైతులకు అందిస్తున్న పలు రకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ సీఈవో ఎడ్ల సతీశ్‌, డైరెక్టర్లు చీమల సత్యం, రాజునాయక్‌, బండి రమేశ్‌, బాసాని హిమాకర్‌, దండ్రు రాజయ్య, తోటపల్లి ప్రశాంత్‌, జక్కుల ఐలయ్య, సిబ్బంది గోపాల్‌, అమీన్‌, సాంబమూర్తి, రాజబాపు, పవన్‌, కార్తీక్‌, శ్రీలత, రైతులు పాల్గొన్నారు. 


VIDEOS

logo