బాలల భవిష్యత్‌ను కాపాడాలి

- డీఎస్పీ సంపత్ రావు
కృష్ణకాలనీ, నవంబర్ 15 : చైల్డ్ లైన్ 1098కి జిల్లాలోని ప్రతి పౌరుడు సమాచారం అందించి బాలల భవిష్యత్‌ను కాపాడాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు అన్నారు. నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తన కార్యాలయంలో చైల్డ్ లైన్ సిబ్బందితో కలిసి ‘చైల్డ్‌లైన్ సే దోస్తీ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. చట్ట సభల్లో బాలల కోసం రూపొందించిన హక్కుల గురించి చైల్డ్ లైన్ సిబ్బంది గ్రామస్థాయిలో అవగాహన కా ర్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నా రు. బాల్యవివాహాలు జరిగినా, బాల కార్మికు లు, భిక్షాటన చేస్తున్న, తప్పిపోయిన బాలలు కనిసిస్తే వెంటనే 1098కి సమాచారమందించాలన్నారు. అనంతరం చైల్డ్ లైన్ కో ఆర్డినేట ర్ సుమన్ మాట్లాడుతూ.. ఈ నెల 20 వరకు గ్రామ స్థాయిలో బాలలకు ఆటలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో 1098 సిబ్బంది ఎం కళావతి, ఎం రమ్యతులసి, టీ అనిత, బీ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత..
గోవిందరావుపేట : బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యతని సోషల్ వర్కర్ మంద ప్రణయ్‌కుమార్ అన్నారు. బాలల దినోత్సవాన్ని శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ సమితి, చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని చల్వాయిలో నిర్వహించారు. ఈసందర్భంగా 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలలోపు ఉన్న బాల బాలికలకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. అదేవిధంగా మచ్చాపూర్ అంగన్వాడీ సెంటర్లో చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో చైల్డ్ లైన్ మెంబర్ నగేశ్, అంగన్వాడీ టీచర్ ధనలక్ష్మి, డీజీపీయూ రాష్ట్ర కమిటీ మెంబర్ సురేశ్, రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల ఆదాయం!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్‌నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్‌తో సుకుమార్ సినిమా
- పెట్రోల్, డీజిల్‌లపై పన్నులకు కోత? అందుకేనా..!
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్