మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Nov 14, 2020 , 02:11:51

బ్లైండ్‌ స్పాట్‌ మిర్రర్‌ ఏర్పాటు

బ్లైండ్‌ స్పాట్‌ మిర్రర్‌ ఏర్పాటు

భూపాలపల్లి: రోడ్డు ప్రమాదాలు జరుగకుండా కేటీకే ఓసీపీ-2వ గని మూలమలుపు వద్ద శుక్రవారం ఆ గని అధికారులు బ్లైండ్‌ స్పాట్‌ మిర్రర్‌ను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి నుంచి కేటీకే 1వ భూగర్భ గనికి వెళ్లే దారిలో కేటీకే ఓసీపీ-2 ఉంది. ఓసీపీ-2 వద్ద దారిలో ఉన్న మూలమలుపు వద్ద తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు కార్మికులు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ప్రమాదాల నివారణకు ఈ మిర్రర్‌ను ఈ గని పీవో జాన్‌ ఆనంద్‌, ఇంజినీర్‌ యాదయ్య ఏర్పాటు చేయించారు.

VIDEOS

logo