ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Nov 13, 2020 , 04:28:13

నాణ్యతే ప్రగతికి ప్రామాణికం

నాణ్యతే ప్రగతికి ప్రామాణికం

భూపాలపల్లి: బొగ్గు నాణ్యతే ప్రామాణికమని, దాని పరిరక్షణ మనందరి బాధ్యత అని భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం ఈ.సీహెచ్‌ నిరీక్షన్‌ రాజ్‌ అన్నారు. గురువారం స్థానిక జీఎం కార్యాలయ ఆవరణలో బొగ్గు నాణ్యత వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన క్వాలిటీ పతాకావిష్కరణ చేశారు. జీఎం కార్యాలయ సిబ్బందితో కలిసి నాణ్యత  వారోత్సవాల ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏరియా ఎస్‌వోటూ జీఎం జి. రఘుపతి, ఏజీఎం(ఐఈడీ) జ్యోతి, పర్సనల్‌, సివిల్‌, క్వాలిటీ డీజీఎంలు మంచాల శ్రీనివాస్‌, కే.సత్యనారాయణ, ఎస్‌.కవీంద్ర, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


VIDEOS

logo