శనివారం 27 ఫిబ్రవరి 2021
Jayashankar - Nov 12, 2020 , 02:45:39

నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలి

నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలి

ములుగు కలెక్టరేట్‌, నవంబర్‌11: నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) ఆదర్శ్‌ సురభి  అన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బుధవారం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలకు నిర్వహించిన అవగాహన, శిక్షణా కార్యక్రమంలో  ఆయన మాట్లాడారు. జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో 92, ఐకేపీ 44, గిరిజన సహకార సంఘాలతో 34 మొత్తం 170 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తాగు నీరు, నీడ కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతి కేంద్రంలో కావాల్సిన టార్ఫలిన్లు, తూకం, తేమ పరీక్షల యంత్రాలను ఉంచాలన్నారు. మంగపేట మండలం అకినేపల్లి మల్లారం, బోరునర్సాపూర్‌, తిమ్మంపేట గ్రమాల్లో వరి కోతలు పూర్తయి ధాన్యం సిద్ధంగా ఉన్నందున గురువారం కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిబంధనల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఏ.పారిజాతం, రైతు బుంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి అరవింద్‌ రెడ్డి, జిల్లా సహకార అధికారి విజయభాస్కర్‌ రెడ్డి, డీఎం జీసీసీ ప్రతాప్‌ రెడ్డి, మార్కెటింగ్‌ సెక్రెటరీ సుచిత్ర, పీఏసీఎస్‌ సీఈవోలు, పీఏసీస్‌, ఐకేపీ జీసీసీ ఇన్‌చార్జీలు, ట్రాన్స్‌పోర్ట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.

బొగ్గు ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించండి

భూపాలపల్లి: బొగ్గు ఉత్పత్తి పెంపుపై భూపాలపల్లి ఏరియా అధికారులు మరింత దృష్టి సారించాలని సింగరేణి డైరెక్టర్‌(పా)ఎస్‌.చంద్రశేఖర్‌ సూచించారు. బుధవారం భూపాలపల్లి ఏరియా కేటీకే ఓసీ-2 ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఓసీపీ-2లో కొనసాగుతున్న బొగ్గు ఉత్పత్తి, రవాణా తదితర విషయాలను ఏరియా జీఎం ఈసీహెచ్‌ నిరీక్షణ్‌రాజ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌(పా)మాట్లాడుతూ కరోనా ప్రభావంతోఎ కోల్పోయిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే విధంగా తగిన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ఆయన వెంట ఎస్‌ఓటూ జీఎం రఘుపతి, కేటీసీ ఓసీపీ-2 పీవో జాన్‌ఆనంద్‌, గని మేనేజర్‌ కృష్ణప్రసాద్‌ ఉన్నారు. 


VIDEOS

logo