శనివారం 27 ఫిబ్రవరి 2021
Jayashankar - Nov 12, 2020 , 02:46:13

వేగవంతంగా ధరణి ప్రక్రియ

వేగవంతంగా ధరణి ప్రక్రియ

భూపాలపల్లి /రేగొండ/కాటారం/టేకుమట్ల:  ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. భూపాలపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న రైతులకు బుధవారం తొమ్మిది రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి సంబంధిత రైతులకు భూపాలపల్లి తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఎం.అశోక్‌కుమార్‌ పట్టాదారు ప్రతులను అందజేశారు. రేగొండ మండలంలో బుధవారం వరకు  48 రిజిస్టేషన్లు పూర్తి అయ్యాయి. రేగొండ తహసీల్దార్‌, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్టేషన్లు తీరును జాయింట్‌ కలెక్టర్‌ స్వర్ణలత పరిశీలించి, లభ్ధిదారులకు పట్టాలు అందజేశారు.కాటారంలో నాలుగు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తహసీల్దార్‌ సునీత తెలిపారు. చిట్యాలలో రెండు రిజిస్ట్రేషన్లు చేశారు. ఇప్పటి వరకు 31 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ ఎండీ షరీఫ్‌ తెలిపారు. టేకుమట్లలో 9 రిజిస్ట్రేషన్లు చేసి, పట్టాదారు పాసుపుస్తకం ప్రతిని తహసీల్దార్‌ చందా నరేశ్‌ అందజేశారు. 

VIDEOS

logo