అధికారుల ఉరుకులు..పరుగులు

- కాళేశ్వరంలో కలెక్టర్ మార్క్
- ముక్తీశ్వరుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు
- అభివృద్ధి పనుల పరిశీలన
కాళేశ్వరం, నవంబర్ 11: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య బుధవారం అధికారులను ఉరుకులు..పరుగులు ట్టించారు. అన్ని ప్రభుత్వ శాఖల పనితీరును పరిశీలించేందుకు బుధవారం ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ధరణి సేవలను స్వయంగా పరిశీలించిన ఆయన వివిధ శాఖల పనితీరుపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉండాలనీ, విధులపై ఎవరు నిర్లక్ష్యం వహించినా షోకాజ్ నోటీసులు జారీ చేస్తామంటూ హుకుం జారీ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మొదటిసారిగా కాళేశ్వరం దేవస్థానానికి ఆలయ ఈవో మారుతి, ఇన్చార్జి తహసీల్దార్ విఠలేశ్వర్, ఆలయ పూజారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారి సన్నిధిలో పూజలు చేశారు. ఈవో ఈవో మారుతి, ఎంపీటీసీ మమత ,సర్పంచ్ వసంత తదితరులు కలెక్టర్‌కు స్వామి వారి చిత్ర పటం అందజేశారు. అనంతరం కాళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, రైతు వేదిక నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ వసంత, ఎంపీటీసీ మమతలను ఆదేశించారు. అక్కడ నుంచి ఆయన నేరుగా కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించారు. ప్రాజెక్టు ఆవరణలో హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. అనంతరం పంప్‌హౌస్‌లోని వాటర్ పంపింగ్ సిస్టంను పరిశీలించారు. పంప్‌హౌస్ ఇంజినీర్లు వాటర్ పంపింగ్ పద్ధతిని కలెక్టర్‌కు వివరించారు. ఇక్కడ నుంచి మహదేవపూర్ మండల కేంద్రంలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి అక్కడ ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఆస్పత్రిలో సిబ్బంది రోజువారి హాజరు పట్టిక పరిశీలించి సూచనలు చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. విధులపై నిర్లక్ష్యం ప్రదర్శించిన వారి విషయంలో ఉపేక్షించేది లేదని, వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేసి వేతనం నిలిపివేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. ఆస్పత్రికి అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఆస్పత్రిలో జరుగుతున్న ఫ్లోర్ మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ డీఈ సాయిలును ఆదేశించారు. మహదేవపూర్‌లోని రెవెన్యూ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి ధరణి సేవలను పరిశీలించారు. అనంతరం పార్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేశాక,కల్యాణ మండపంలో అర్చకులు అశీర్వచనం చేసీ తీర్థప్రాసదం అందజేశారు.
తాజావార్తలు
- ఆ టైంలో అందరూ భయపెట్టారు: అమలా పాల్
- ఖాదర్‌బాషా దర్గాను సందర్శించిన హోంమంత్రి
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్
- 18 ఏళ్లకే ముద్దు పెట్టేశా.. ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
- కందకుర్తి సరిహద్దులో ఇంజక్షన్ కలకలం