గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Nov 11, 2020 , 02:30:03

భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

  • సివిల్స్‌లో 782వ ర్యాంకు సాధించిన నరేశ్‌ను అభినందించిన జీఎం నిరీక్షణ్‌ రాజ్‌

భూపాలపల్లి : సివిల్స్‌లో మెరిసిన ఆకునూరి నరేశ్‌ భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఈసీహెచ్‌ నిరీక్షణ్‌ రాజ్‌ అన్నారు. ఆల్‌ ఇండియా సివిల్స్‌ పరీక్షలో 782 ర్యాంకు సాధించిన కాశీంపల్లికి చెందిన నరేశ్‌ను మంగళవారం జీఎం తన కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. పేదరికాన్ని పక్కన పెట్టి తనను ఇంత స్థాయికి తీసుకువచ్చిన అమ్మనాన్నలను మంచిగా చూసుకోవాలన్నారు. తను చేస్తున్న ఉద్యోగంలో పేరు తెచ్చుకోవాలని నరేశ్‌కు సూచించారు. కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం రఘుపతి, ఏరియా అధికార ప్రతినిధి మంచాల శ్రీనివాస్‌, డీజీఎం సత్యనారాయణ, ఎంవీటీసీ మేనేజర్‌ రమణ పాఠక్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo