సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Nov 11, 2020 , 02:30:03

‘ఆగ్రోస్‌' కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

‘ఆగ్రోస్‌' కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి టౌన్‌: తెలంగాణ ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవా లని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సూచించారు. భూపాలపల్లి పట్టణంలోని మంజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌ను ఆ యన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొన సాగే ఈ ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రంలో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు లభిస్తా యని అన్నారు. అలాగే వ్యవసాయ పరికరాలను సైతం అందిస్తుందని తెలిపారు. సేవా కేంద్రం ద్వా రా ప్రైవేట్‌ విత్తన, ఎరువుల దుకాణ దారుల మో సాల నుంచి బయటపడవచ్చని తెలిపారు. కార్యక్ర మంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కళ్లెపు శోభారఘుపతి రావు, ఎంపీపీ మందల లావణ్యాసాగర్‌రెడ్డి, ము న్సి పల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణీసిద్ధు, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌కుమార్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల, అర్బన్‌ అధ్యక్షులు మందల రవీందర్‌రెడ్డి, క్యాత రాజు సాంబమూర్తి, కౌన్సిలర్‌ మురళి, నాయకు లు  బుర్ర రమేశ్‌, నాగవెళ్లి రాజలింగమూర్తి, పిం గిళి రవీందర్‌రెడ్డి, సేవా కేంద్రం ప్రొప్రైటర్‌ పొడి శెట్టి అరుణ, కోఆర్డినేటర్‌ కందుకూరి శ్రీనివాస్‌, న్యాయవాది శ్రీనివాసాచారి పాల్గొన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo