సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Nov 11, 2020 , 02:30:07

నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌

నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌

  • చెక్కుల పంపిణీలో జడ్పీ చైర్మన్‌ జగదీశ్వర్‌

ఏటూరునాగారం, నవంబర్‌ 10 : అనారోగ్యం బారిన పడి ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందిన వారికి సీఎంఆర్‌ఎఫ్‌  అండగా ఉంటుందని జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. మండలాధ్యక్షుడు గడదాసు సునీల్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జగదీశ్వర్‌ మాట్లాడుతూ.. ఎంతో మంది నిరుపేద కుటుంబాలను ఈ పథకం ద్వారా ఆదుకున్నామన్నారు. ఏటూరునాగారం మండలం రామన్నగూడేనికి చెందిన చిట్టెం సమ్మయ్య, కొండాయికి  చెందిన హసీద్‌, కన్నాయిగూడెం మండలం గూర్రేవులకు  చెందిన పాపుర జయమ్మ, పల్లా తిరుపతి, పూజరి నర్సమ్మకు రూ. 1.78లక్షల విలువ చేసే చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్‌ సభ్యురాలు వలియాబీ, వైస్‌ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, ఆత్మ చైర్మన్‌ గోవింద్‌ నాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కూనూరు అశోక్‌, ఎంపీటీసీ కుమ్మరి స్వప్న, జిల్లా, మండల నాయకులు గోవింద్‌ నాయక్‌, తుమ్మ మల్లారెడ్డి, సర్దార్‌పాషా, రాంనర్సయ్య, కావిరి చిన్నికృష్ణ, కూనూరు మహేశ్‌, అటికె నాగేశ్వర్‌రావు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సిద్ధబోయిన రాంబాబు, మాజీ ఎంపీపీ తూరం పద్మ, వావిలాల రాంబాబు, భోజారావు, చంద్రబాబు, దన్నపునేని కిరణ్‌, ఖాజాపాషా, కందకట్ల శ్రీనివాస్‌, చందా లక్ష్మీనారాయణ, ఎండీ సలీంపాషా, అజ్మత్‌ఖాన్‌, ఎగ్గడి కోటయ్య, అల్లి శ్రీనివాస్‌, సర్పంచ్‌ దొడ్డ కృష్ణ, సుబ్బుల సమ్మయ్య, మధుకర్‌,  ఎల్‌ రాజేశ్‌, కొండాయి చిన్ని, తాహెర్‌పాషా తదితరులు పాల్గొన్నారు. 

జడ్పీ చైర్మన్‌ను కలిసిన సీఈవో.. 

ములుగు : ఇటీవల జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ప్రసూనారాణి మంగళవారం జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జగదీశ్వర్‌కు పూల మొక్క అందించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ.. నూతన జిల్లా ములుగు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తరఫున సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని తెలిపారు. అంతకు ముందు సీఈవోను డీఆర్‌డీఏ పీడీ పారిజాతం, కార్యాలయ పర్యవేక్షకులు ఏవీ రాజు, సిబ్బంది ప్రసూనరాణికి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. 


VIDEOS

logo