శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Nov 11, 2020 , 02:30:07

సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా

సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా

  • కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

భూపాలపల్లి కలెక్టరేట్‌, నవంబర్‌ 10 : జిల్లా సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని, అధికార యంత్రాంగం భాగం పంచుకోవాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టర్‌ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం కార్యాలయానికి రాగా ఏవో మహేశ్‌బాబు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌ను సంయుక్త కలెక్టర్‌ కూరాకుల స్వర్ణలత, ఆర్డీవో శ్రీనివాస్‌, జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ.. జిల్లా సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా అధికారులు అంకితభావంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైన పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, వైకుంఠధామాలు, రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.  పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సం దర్భంగా శాఖల వారీగా ఉద్యోగులు, ఖాళీల వివరాలు అందించాలని ఆదేశించారు. అనంతరం వివిధ శాఖల అధికారుల చాంబర్లను పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగపద్మజ, జిల్లా సంక్షేమ అధికారి శ్రీదేవి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శశిధర్‌రెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శైలజ, జిల్లా యువజన సర్వీసు ల శాఖ అధికారి సునీత, జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి వెంకటేశ్వర్లు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌ మనోహర్‌, డీపీఆర్వో రవికుమార్‌, జిల్లా మ త్స్యశాఖ అధికారి భాస్కర్‌, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, సూపరింటెండెంట్లు శ్రీనివాసరావు, రవికుమార్‌, సింగరేణి జీఎం నిరీక్షణ్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo