బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jayashankar - Nov 10, 2020 , 02:40:35

కలెక్టర్‌ బదిలీతో జిల్లాలో సంబురాలు

 కలెక్టర్‌ బదిలీతో జిల్లాలో సంబురాలు

  •  కార్యాలయాల్లో స్వీట్లు పంచిన ప్రజాప్రతినిధులు 
  • అభివృద్ధిని పట్టించుకోలేదు 
  • భూపాలపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరాణి సిద్దు 

భూపాలపల్లి/మొగుళ్లపల్లి: భూపాలపల్లి కలెక్టర్‌ అబ్దుల్‌ అజీం బదిలీతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వీట్లు పంపిణీ చేసి, సంబురాలు జరుపుకుంటున్నారు. కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులను కమీషన్ల కోసం ఇబ్బందులకు గురి చేసేవారని పలువురు పేర్కొన్నారు. సోమవారం భూపాలపల్లి ఆర్డీవో, తాహసీల్దార్‌ కార్యాలయాల్లో అధికారులకు, సిబ్బందికి, కార్యాలయానికి పని నిమిత్తం వచ్చిన రైతులకు స్వీట్లు పంచారు.

ఈ సందర్భంగా భూపాలపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి సిద్దు మాట్లాడుతూ కలెక్టర్‌ అబ్దుల్‌ అజీంకు తాము ఎన్నిమార్లు విన్నవించినా అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆరోపించారు.  అటువంటి కలెక్టర్‌ను ప్రభుత్వం బదిలీ చేయడం హర్షణీయమని అన్నారు.  భూపాలపల్లి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు హారిక, శారద, మౌనిక, మమత, కమల, సరోజన, టీఆర్‌ఎస్‌ నాయకులు సెగ్గం సిద్దు, నాగవెళ్లి రాజలింగమూర్తి శ్రీనివాస్‌, నారాయణ తిరుపతమ్మ స్వీట్లు పంపిణీ చేశారు. మొగుళ్లపల్లిలో జడ్పీటీసీ జోరుక సదయ్య మాట్లాడుతూ కలెక్టర్‌ను బదిలీ చేయడం అభినందనీయమన్నారు. వైస్‌ ఎంపీపీ పోల్నేని రాజేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి పున్నం చందర్‌రావు, సర్పంచ్‌లు మోటే ధర్మారావు, కొనుకటి అరవింద్‌, పెంతల రాజేందర్‌, దానవేన రాములు, శ్రీనివాస్‌, నర్సింహరెడ్డి, సుమన్‌, కుమార్‌ సంబురాల్లో పాల్గొన్నారు.


VIDEOS

logo