లైంగిక దాడి ఘటనలో వ్యక్తి అరెస్ట్

కాటారం: మండలంలోని బయ్యారం గ్రామంలో గిరిజన బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన అదే గ్రామానికి చెందిన చినాల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినట్లు కాటారం డీఎస్పీ బోనాల కిషన్ తెలి పారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిం చారు. పొలం పనికి వచ్చిన బాలికపై చినాల శ్రీనివాస్ పలు మార్లు లైంగిక దాడి చేశాడు.
ఈ క్రమంలో బాధితురాలు 2016, డిసెంబర్ 8న భూపా లపల్లి ప్రభుత్వ దవాఖానలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విష యం ఎవరికైనా చెప్తే చంపేస్తానని నిందితుడు బెదిరించడంతో బాలిక భయపడింది. ఈ క్రమంలో మహిళా పోలీస్ అధికారి, రేగొం డ ఏఎస్సై శైలజ బాధితురాలికి పలుమార్లు కౌన్సెలింగ్ ఇవ్వగా జరిగి న సంఘటనను చెప్పింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీని వా స్ను కాళేశ్వరంలో సోమవారం అదుపులోకి తీసుకుని విచారించ గా నేరం ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదిం చడానికి, నిందితుడిని పట్టుకోవడానికి సహకరించిన ఏఎస్సై శైల జ, కాటారం ఎస్సై సాంబమూర్తి, కానిస్టేబుళ్లు వినోద్‌బాబు, మహబూ బ్పాషాను డీఎస్పీ బోనాల కిషన్, సీఐ హతీరాం అభినందించారు.
తాజావార్తలు
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
- ఏపీలో కొత్తగా 124 కరోనా కేసులు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్‌ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఇక్కడ బంగారం లోన్లపై వడ్డీ చౌక.. ఎంతంటే?!
- విమానంలో కరోనా రోగి.. బయల్దేరే ముందు సిబ్బందికి షాక్!
- టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ కవిత సమావేశం
- పెట్రోల్‌పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఆర్‌యూపీపీ, ఎస్‌ఎల్‌టీఏ సంఘాలు