శనివారం 06 మార్చి 2021
Jayashankar - Nov 09, 2020 , 05:13:44

కార్మికుల సంక్షేమమే ధ్యేయం

కార్మికుల సంక్షేమమే ధ్యేయం

  • టీబీజీకేఎస్‌ నేత తిరుపతి
  • క్వార్టర్ల నిర్మాణ స్థల చదును పరిశీలన

భూపాలపల్లి : సింగరేణి కార్మికుల సంక్షేమమే టీబీజీకేఎస్‌ ధ్యేయమని ఆ సంఘం భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి పేర్కొన్నారు. ఆదివారం భూపాలపల్లి ఏరియాలో కార్మికుల నివాసార్థం సింగరేణి సంస్థ చేపట్టిన క్వా ర్టర్ల నిర్మాణ భూమి చదును పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ భూపాలపల్లి సింగరేణి కార్మికుల నివాసం కోసం మరో వెయ్యి క్వార్టర్లను నిర్మిస్తామని కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నెరవేర్చారన్నారు. 994 క్వార్టర్లలో భూపాలపల్లి ఏరి యా కేఎల్‌పీ రహదారిలో 8ఇైంక్లెన్‌ కాలనీ సమీపంలో 854 క్వార్టర్లను నిర్మిస్తారన్నారు. మరో 140 క్వార్టర్లు భూపాలపల్లి ఏరియా మిలీనియం క్వార్టర్స్‌ సముదాయ సమీపంలో నిర్మించనున్నట్లు తెలిపారు.   సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌ రూ.68,500 ఈనెల 14న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని, ఈ విషయమై సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ యాజమాన్యంతో మాట్లాడినట్లు తెలిపారు.  టీబీజీకేఎస్‌ నేతలు మండ సంపత్‌, రాయిశెట్టి కనకయ్య, బత్తుల వెంకటేశ్వర్లు, కే.రాంచందర్‌, ఫిట్‌ సెక్రటరీలు కొచ్చర్ల రవికుమార్‌, గాజ సాంబయ్య, గోవిందుల రాంచందర్‌ తదితరులున్నారు.  


VIDEOS

logo