అదనపు కట్నం కోసం వేధింపులు

- రూ. 25 లక్షలు ఇచ్చినా తీరని దాహం
- రెండేళ్ల కూతురితో కలిసి ఉరేసుకున్న తల్లి
- భర్త అత్తమామలపై కేసు నమోదు చేసిన పోలీసులు
కృష్ణకాలనీ: అదనపు కట్నం వేధింపులకు ఓ తల్లి తన రెండేళ్ల కూతురితో సహా బలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేం ద్రంలోని జవహర్‌నగర్ కాలనీ లో శుక్రవారం తన కూతురితో పాటు తల్లి ఉరేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పో లీసుల కథనం ప్రకారం.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటికి చెందిన కుమారస్వామి కి, కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన లాస్యతో 2016లో వివాహమైంది. ఆ సమయంలో రూ. 25 లక్షల దాకా విలువ జేసే కట్నకానుకలు ఇచ్చారు.
కుమార్ సింగరేణి ఉద్యోగి కావడంతో ఈ మధ్యే బదిలీపై భూపాలపల్లిలోని కేటీకే-1 ఇైంక్లెన్కు వచ్చారు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం దంపతు ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వేధింపులు భరించలేక లాస్య (25), కూతురు మహిత (2)కు ఉరేసి తానూ ఉరేసుకుని తనువు చాలించింది. కుమారస్వామి డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇద్దరూ ఉరికి వేలాడు తూ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదనపు కట్నం వేధింపుల వల్లే తన చెల్లెలు ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి అన్న సందవేణి రాజు ఇచ్చిన ఫిర్యా దు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. కాగా అభం శుభం తెలియని పసిపాప కూడా ఉరికి వేలాడుతూ కనిపించడం స్థానికులను కలిచివేసింది.
తాజావార్తలు
- ఎస్యూవీ కార్లకు ఫుల్ డిమాండ్: ఫిబ్రవరి సేల్స్ మిక్చర్ పొట్లాం!!
- మహిళ ఫిర్యాదుతో ఆప్ ఎమ్మెల్యేపై వేధింపుల కేసు
- సచిన్ ముందే చూడకుండా రుబిక్ క్యూబ్‌ని సెట్ చేశాడు..వీడియో వైరల్
- ‘4-5 రోజుల తర్వాత మరణిస్తే టీకాతో సంబంధం లేనట్లే..’
- ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం
- బీపీసీఎల్ ఫర్ సేల్: నుమలీగఢ్ రిఫైనరీతో షురూ..!
- నెట్‌ఫ్లిక్స్ డీల్ కు నో..కారణం చెప్పిన నాగార్జున
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు