మంగళవారం 09 మార్చి 2021
Jayashankar - Nov 05, 2020 , 05:22:36

ధ్రువీకరణ పత్రాల పరిశీలన

ధ్రువీకరణ పత్రాల పరిశీలన

భూపాలపల్లి కలెక్టరేట్‌, నవంబర్‌4: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్‌, సభ్యుల నియామకానికి గతంలో పరీక్ష రాసి ఇంటర్వ్యూకు అర్హులైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా సంక్షేమాధికారి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఇందులో ఏడుగురు అభ్యర్థులకు ఐదుగురు అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా సంక్షేమాధికారి పి.శ్రీదేవి తెలిపారు. ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు ఈనెల 11న వర్చువల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తామని, అందులో ఎంపికైన వారితో బాలల సంక్షేమ సమితి ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో బాలల న్యాయ చట్టం-2015 ప్రకారం బాలల సంక్షేమ సమితిలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీరిని నియమిస్తున్నట్లు తెలిపారు.


VIDEOS

logo