ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jayashankar - Nov 05, 2020 , 05:22:40

వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించాం

వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించాం

  • కరోనా వ్యాప్తిని తగ్గించగలిగాం
  • కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌

భూపాలపల్లి కలెక్టరేట్‌, నవంబర్‌4: హ్యాండ్‌ వాష్‌, వ్యక్తిగత శుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించి జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించగలిగామని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు. బుధవారం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌, యూనిసెఫ్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ వారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ర్టాల అధికారులతో హ్యాండ్‌ వాష్‌, కొవిడ్‌-19 నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ  జిల్లాలో కరోనా లాక్‌డౌన్‌ కంటే ముందు నుంచే అప్రమత్తమై ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు. తొలి మూడు నెలల్లో జిల్లాలో ముగ్గురే కరోనా బారిన పడ్డారని అన్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతి నిధుల సహకారంతో జిల్లాలో కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం క్షయ నియంత్రణకు ఉచిత వైద్య సేవలను పొందేందుకు అవసరమైన 6366937337 నంబర్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేసి కలెక్టర్‌ మాట్లాడారు. 

ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించండి

మున్సిపాలిటీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూములను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. 30 వార్డులను ఐదు క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్‌కు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, వారు పారిశుధ్య, అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షించేలా చూడాలని అన్నారు. 

కలెక్టర్‌కు సన్మానం 

ఉత్తమ సేవలు అందించినందుకు లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ సేవా పురస్కారం, కన్నడ గ్రూప్‌ అఫ్‌ సిటిజన్స్‌ వారి స్టార్‌ ఐఏఎస్‌ అధికారిగా అవార్డును పొందినందుకు బుధవారం పట్టణంలోని మజిద్‌ అబ్బాసీయ మసీదుకు చెందిన ముతావళి మహ్మద్‌ యూసుఫ్‌ ఉద్దీన్‌, మహ్మద్‌ కమల్‌ ఉద్దీన్‌ సభ్యులు కలెక్టర్‌ను సన్మానించారు. జడ్పీసీఈవో, ఇన్‌చార్జి డీపీవో నాగపద్మజ, డీబీసీడీ, ఇన్‌చార్జి డీఆర్డీవో శైలజ, డీఎం హెచ్‌వో సుధార్‌సింగ్‌, డీఐవో ఉమాదేవి, డాక్టర్‌ మమతా దేవి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, కలెక్టర్‌ కార్యాలయ ఏవో మహేశ్‌బాబు, డీపీఆర్వో రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo