Jayashankar
- Nov 04, 2020 , 01:18:51
VIDEOS
ఫినాయిల్ తాగి మరొకరు..

పాలకుర్తి రూరల్: మండలంలోని విస్నూరు శివారు వడ్డెర కాలనీ లో సోమవారం ఓ వ్యక్తి ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. బొమ్మిశెట్టి యాకయ్య(45) హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. తన బంధువైన మండలంలో ని బమ్మెర గ్రామానికి చెందిన బొంత కొంరయ్య నుంచి రూ. 50 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలో కొంరయ్య, అతడి బంధువులు డబ్బులివ్వాలని యాకయ్యను నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన యాకయ్య సోమవారం ఉదయం ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్లో కేసు న మోదు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన బంధువులు కొంరయ్య ఇం ట్లో గుంత తీయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచా రం అందుకున్న పోలీసులు ఎస్సై గండ్రాతి సతీశ్ ఆధ్వర్యంలో అక్క డికి చేరుకుని వారిని శాంతింపజేశారు.
తాజావార్తలు
- బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం.. పిల్లల్ని కిటికీలోంచి పడేసిన తల్లి
- ఆర్ట్ ఎగ్జిబిషన్లో సల్మాన్ పెయింటింగ్స్ ప్రదర్శన
- స్నిఫర్ డాగ్‌కు ఘనంగా వీడ్కోలు.. వీడియో
- పట్టాలెక్కనున్న మరో ఐదు ప్రత్యేక రైళ్లు
- ప్రిన్స్ సల్మాన్ ఆదేశాల ప్రకారమే జర్నలిస్టు ఖషోగ్గి హత్య
- అతివేగం, మద్యంమత్తుకు మరో ప్రాణం బలి
- ఎన్టీఆర్ మాస్క్‌పై చర్చ.. ధర తెలుసుకొని షాక్..!
- చైనా వ్యాక్సిన్‌ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
MOST READ
TRENDING