అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగాలి

కొత్తకోట రూరల్: అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ద్యేయమని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు భీంరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రామకృష్ణాపురంలో ఉచిత చేప పిల్లలను మార్కెట్ డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, మత్స్యకారులతో కలిసి ఊర చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. అందులో భాగంగానే మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారని, వాటిని మత్స్యకారులు సంరక్షించి ఆర్థికంగా లాభపడాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అన్నివర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి, నాయకులు పరమేశ్, మొగులన్న, రాంప్రసాద్, మత్స్యకారులు శాంతన్న, బాలరాజు, చంద్రుడు, నరసింహా పాల్గొన్నారు.