మంగళవారం 09 మార్చి 2021
Jayashankar - Nov 04, 2020 , 01:19:08

సారా విక్రయిస్తే కఠిన చర్యలు

సారా విక్రయిస్తే కఠిన చర్యలు

పాన్‌గల్‌: నాటుసారా తయారీ, విక్రయాలను ప్రభుత్వం నిషేధించిందని, అలాంటి నిబంధనలు వ్యతిరేకించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తాసిల్దార్‌ శ్రీనివాస్‌రావు అన్నారు. మండలంలోని గోప్లాపూర్‌, శాగాపూర్‌తండా, కేతేపల్లి, బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో సారా అమ్ముతూ పట్టుబడిన వ్యక్తులను మంగళవారం ఎక్సైజ్‌ పోలీసులు తాసిల్దార్‌ శ్రీనివాస్‌రావు ఎదుట బైండోవర్‌ చేశారు. అక్రమంగా సారా అమ్మినవారిపై రూ.లక్షవరకు జరిమానా వేయనున్నట్లు సూచించారు. కార్యక్రమంలో డీటీ చక్రపాణి, ఎక్సైజ్‌ పోలీసులు రాజు, సురేశ్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.


VIDEOS

logo