టీఆర్ఎస్కే ఓటు అడిగే హక్కు

ఏటూరునాగారం, నవంబర్ 2 : ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్కు మాత్రమే ఉందని, రాష్ట్రంలోని ప్ర తి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని జడ్పీ చైర్మన్ కుసు మ జగదీశ్వర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ ఫంక్షన్ హాలులో సోమవారం ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల స్థా యి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం తుది దశకు చేరుకుందని, పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మూడు నెలలకు ఒకసారి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు తా వులేదన్నారు. ప్రతి కార్యకర్త తన ఇంటి కుటుంబ సభ్యుడేనన్నారు. అన్ని వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సమన్యా యం జరుగుతున్నదన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ కో ఆర్డినేటర్ పోరిక గోవింద్ నాయక్, టీఆర్ఎస్ మూడు మండలాల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్, కుడుముల లక్ష్మీనారాయణ, సుబ్బుల సమ్మయ్య, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ వలియాబీ, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, పీఏసీఎస్ చైర్మన్ రమేశ్, వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, జిల్లా, మండల నాయకులు తుమ్మ మల్లారెడ్డి, శ్రీధర్‌వర్మ, సర్దార్‌పాషా, చిన్ని కృష్ణ, శ్రీహరి, కొండాయి చిన్ని, కందకట్ల శ్రీనివాస్, తాహెర్ పాషా, సిద్ధబోయిన రాం బాబు, ఖాజాపాషా, చంద్రబాబు, రా మకృష్ణ, ములుగు ఆత్మ చైర్మన్ బైకానీ ఓదెలు, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సాంబయ్య, సామ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అభివృద్ధి చెందాలి..
మండలంలోని చిన్నబోయినపల్లిలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని జడ్పీ చైర్మన్ జగదీశ్వర్ ప్రారంభించారు. ఈసందర్భం గా మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. కాగా, పలువురు రైతు లు పోడు భూముల సమస్యను జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. సర్వే నెంబర్ 98లో అటవీ భూమే కాకుండా రెవెన్యూ భూమి కూడా ఉందని, వెంట నే సర్వే చేయాలని రైతులు విన్నవించా రు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ సం జీవరెడ్డి, రైతులు గంట కృష్ణ, ఇబ్రహీం, ఫతే మహ్మద్, రామకృష్ణ, భద్రకాళి వీ వో పరిధిలోని మహిళా సంఘాల ప్రతినిధి ఆడెపు శాంత, మాజీ ఎంపీపీ మెహరున్నీసా తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బీజేపీలో చేరి ‘రియల్ కోబ్రా’ను అంటున్న మిథున్ దా
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం