దీపావళిలోగా విలేజ్ పార్కులు పూర్తి చేయాలి

భూపాలపల్లి కలెక్టరేట్, అక్టోబర్ 2 : దీపావళిలోగా జిల్లా లో చేపట్టిన అన్ని పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు పూర్తి చేయాలని కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్‌లో మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, స్థలాల సేకరణ 92 శాతం పూర్తయిందన్నారు. మిగతా గ్రామాల్లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని దీపావళిలోగా 383 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు 100 శాతం పూర్తి చేయాలన్నారు. చాలా గ్రామాల్లో స్థలాలు అందుబాటులో ఉన్నందున మండల ప్రత్యేకాధికారి, ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు టాస్క్‌ఫోర్స్ బృందంగా ఏర్పడి ఈ నెల 20లోగా వైకుంఠధామాలు, చెత్త డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. రైతు వేదికల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా ఎంపీడీవోలు సర్పంచ్‌లకు సహకారం అందించాలన్నారు. ఈ నెల 6లోగా అన్ని గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్రాలీల పంపిణీ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి నాగ పద్మజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టాయిలెట్ల నిర్మాణం వేగవంతం చేయాలి..
పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మున్సిపాలిటీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలో ఆధునిక పద్ధతిలో 12 పబ్లిక్ టాయిలెట్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటి వరకు మూడింటి నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్మికులకు తోడు మరో 30 మందిని తాత్కాలికంగా నియమించుకోవాలన్నారు. చెత్త బుట్టలను అన్ని వార్డుల్లో ఏర్పాటు చేయాలన్నారు. సింగరేణి, జెన్కో సంస్థల సహకారంతో సీఆర్ నగర్ బాంబుల గడ్డ నుంచి చెల్పూరు వరకు ప్రధాన రహదారిపై పడిన గుంతలను పూడ్చివేయాలని, మున్సిపాలిటీలోని అన్ని విధుల్లో సక్రమంగా వీధిలైట్లు వెలిగేలా చూడాలన్నారు. మంసాహార దుకాణాలపై దాడులు నిర్వహించి పరిశుభ్రమైన మంసం మాత్రమే విక్రయించేలా చూడాలని, ఎఫ్ఎస్టీపీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఏఈ రాజన్న, టీపీబీవో అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వెంకీ-మీనా ‘దృశ్యం 2’ షురూ అయింది
- కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేది లేదు : ఇఫ్కో
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- శివసేన నేతలతో ప్రాణ హాని : సుప్రీంకోర్టులో బాలీవుడ్ క్వీన్ పిటిషన్
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ